Surya Grahan 2023: పాక్షికం.. సంపూర్ణం.. ఈసారి సూర్యగ్రహణం విభిన్నం

Surya Grahan 2023: పాక్షికం.. సంపూర్ణం.. ఈసారి సూర్యగ్రహణం విభిన్నం

ఏప్రిల్ 20న సూర్యగ్రహణం ఏర్పడనుండగా.. ఈ సారి పడే గ్రహణానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. మామూలుగా సూర్య గ్రహణం అంటే పాక్షిక సూర్యగ్రహణం లేదా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ ఈ సారి ఈ రెండింటి మిశ్రమంగా సూర్య గ్రహణం ఏర్పడనుంది. దీన్ని (హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్) హైబ్రిడ్ సూర్యగ్రహణం అంటారు. ఇది ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో 18నెలలకు ఒకసారి సంభవించడం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. 

హైబ్రిడ్ సూర్యగ్రహణం ఏప్రిల్ 20న సంభవిస్తుంది. ఇది ఉదయం 10:04 గంటలకు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 11:30 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ గ్రహణం రెండు గంటలకు పైగా ఉంటుంది. సూర్యుడు పూర్తిగా కప్పివేయడమనేది ఒక నిమిషం కన్నా తక్కువే ఉంటుంది. 

హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్ 2023ని చూసే నగరాలు

సమయం, తేదీ ప్రకారం ఈ హైబ్రిడ్ గ్రహణం ఏప్రిల్ 20న ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. సూర్యగ్రహణం  భారతదేశం మార్గం గుండా వెళ్ళకపోవడం మరో ముఖ్యాంశంగా చెప్పవచ్చు. దక్షిణ/తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. 

ప్రపంచంలోని ఈ నగరాలు హైబ్రిడ్ సూర్యగ్రహణాన్ని చూడవచ్చు:

* ఆమ్‌స్టర్‌డామ్ ద్వీపం - ఫ్రెంచ్ సదరన్ టెరిటరీలు
* పోర్ట్-ఆక్స్-ఫ్రాంకైస్ - ఫ్రెంచ్ సదరన్ టెరిటరీస్, ఫ్రాన్స్
* పెర్త్ - వెస్ట్రన్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా
* జకార్తా - జకార్తా ప్రత్యేక రాజధాని ప్రాంతం, ఇండోనేషియా
* మకస్సర్ - సౌత్ సులవేసి, ఇండోనేషియా
* దిలీ - తైమూర్-లెస్టే
* డార్విన్ - నార్తర్న్ టెరిటరీ, ఆస్ట్రేలియా
* జనరల్ శాంటోస్ - ఫిలిప్పీన్స్
* మనోక్వారీ - వెస్ట్ పాపువా, ఇండోనేషియా
* పోర్ట్ మోర్స్బీ - పాపువా న్యూ గినియా
* న్గెరుల్ముడ్ - పలావు
* హోనియారా - సోలమన్ దీవులు
* హగాత్నా - గ్వామ్
* సైపాన్, ఉత్తర మరియానా దీవులు
* బేకర్ ద్వీపం - యుఎస్ మైనర్ అవుట్‌లైయింగ్ దీవులు
* పాలికిర్ - పోన్‌పే, మైక్రోనేషియా
* ఫునాఫుటి - తువాలు
* యారెన్ - నౌరు
* తరవా - కిరిబాటి
* మజురో - మార్షల్ దీవులు

భారతదేశం హైబ్రిడ్ సూర్యగ్రహణాన్ని చూడవచ్చా?

లేదు, హైబ్రిడ్ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు.