పలు దేశాల్లో ఆకట్టుకున్న సూర్య గ్రహణం దృశ్యాలు

పలు దేశాల్లో ఆకట్టుకున్న సూర్య గ్రహణం దృశ్యాలు

ఏప్రిల్ 20న సంభవించిన సూర్య గ్రహణం ఎంతో మందిని ఆకర్షించింది. సూర్యుడు నిమిషం పాటు కప్పివేయబడడంతో ఆస్ట్రేలియా, ఇండోనేషియా, తూర్పు తైమూర్‌లోని కొన్ని ప్రాంతాలు పగటి సమయంలోనే ఆ ఒక్క నిమిషం పాటు అంధంకారంలో మునిగిపోయాయి. వివిధ దేశాల్లో ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని ఆసక్తితో వీక్షించారు. అయితే, ఈ గ్రహణం భారత్ లో కనిపించలేదు. రాష్ట్ర రాజధాని పెర్త్‌కు దాదాపు 1,200 కి.మీ దూరంలో ఉన్న ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో ఉన్న మారుమూల పట్టణమైన ఎక్స్‌మౌత్‌కు వేలాది మంది ఈ సూర్య గ్రహణాన్ని చూసేందుకు తరలివచ్చారు. 

ఎక్స్‌మౌత్‌లో  స్టార్‌గేజర్‌లు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:29 గంటలకు సూర్యుని ఉపరితలం మీదుగా చంద్రుడు ప్రవహించడాన్ని చూసేందుకు తమ కారవాన్‌లు, పిచ్‌డ్ టెలిస్కోప్‌లు, రక్షణ గ్లాసెస్ ధరించి సూర్య గ్రహణాన్ని వీక్షించారు. 

జకార్తాలో టెలిస్కోప్‌ల ద్వారా సూర్యుని పాక్షిక కవరేజీని చూడటానికి వేలాది మంది ప్లానిటోరియం వద్దకు చేరుకున్నారు.

ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు, ఖగోళ శాస్త్రవేత్తలతో సహా వెయ్యి మందికి పైగా ప్రజలు తూర్పు తైమూర్ తూర్పు కొనలో ఉన్న కోమ్ బీచ్ వద్దకు చీకటైన ఆ నిమిషాన్ని వీక్షించారు.

స్టార్‌గేజర్‌లు ఖగోళ శాస్త్ర పరికరాలు, యాంటీ-యూవీ గ్లాసులను ఉపయోగించి సూర్య గ్రహణాన్ని తిలకించారు. మరికొందరు నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ తైమూర్ అందించిన టెలిస్కోప్‌లను ఉపయోగించి వీక్షించారు.