
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రెండేళ్లకు ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు మహేష్‌బాబు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి మహేష్ స్టైలిష్ లుక్, టీజర్‌తో పాటు రెండు పాటలు కూడా రిలీజై సెన్సేషన్ సృష్టించాయి. త్వరలో మూడో పాట కూడా రాబోతోంది. ఉగాది కానుకగా ఈ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని చెబుతున్నారు మేకర్స్. ముఖ్యంగా రైల్వేస్టేషన్‌లో జరిగే ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అంటున్నారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన రైల్వేస్టేషన్ సెట్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌ని తీస్తున్నారు. ఈ సాలిడ్ సీన్స్ గూజ్ బంప్స్ తెప్పిస్తాయట. ఈ షెడ్యూల్‌తో మొత్తం షూట్ కూడా పూర్తవుతుందని తెలుస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, జగపతి బాబు, వెన్నెల కిషోర్, సుబ్బరాజు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహేష్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మూవీ మే 12న విడుదల కానుంది.