
దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత నామినేషన్ వేశారు. కేసీఆర్ ఆశీస్సులతో ఈ రోజు తాను నామినేషన్ వేశానని సుజాత అన్నారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అండదండలతో దుబ్బాకను అభివృద్ధి చేస్తానని ఆమె అన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాకలో బైఎలక్షన్ వచ్చింది. ఆ స్థానంలో ఆయన భార్య సోలిపేట సుజాత టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరపున చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. కాగా.. బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
For More News..