తరాలు మారినా చెరగని అనుబంధం

తరాలు మారినా చెరగని అనుబంధం

సోదరీ,సోదరుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పే రాఖీ పండుగ వేళ మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. వారి పిల్లలు హిమాన్షు రావు, అలేఖ్యా రావులు, మరో పక్క తాను, తన సోదరి కవితతో చిన్నప్పుడు కలిసి తీసుకున్న ఫొటోను కేటీఆర్ షేర్ చేశారు. రక్షా బంధన్ ను పురస్కరించుకొని... అన్నాచెల్లెల్ల ప్రేమకు నిదర్శంగా ఆయన ఈ పిక్ ను పంచుకున్నారు. దీంతో పాటు సమ్ బాండ్స్ ఆర్ సో స్పెషల్... అంటే కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి అంటూ ఆ ఫొటోకు తగ్గ క్యాప్షన్ ను కేటీఆర్ జత చేశారు. రాఖీ పండుగ వేళ మంత్రి కేటీఆర్ ఈ ఫొటోను షేర్ చేయడంతో.. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ... పలు కామెంట్లు చేస్తున్నారు.