
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడంతో కొంతమంది నాయకులకు భయం పట్టుకుందని సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు. దేశాన్ని పాలించడానికి సీఎం కేసీఆర్ రాబోతున్నారని చెప్పారు. బండి సంజయ్కు రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో తెలీయదని విమర్శించారు. బండి సంజయ్ ఎన్ని పాదయాత్రలు చేసిన ఒరిగేదేమిలేదని విమర్శించారు.
దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తోందని రవీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాతే బీజేపీ పాలనలో మార్పు వస్తోందని చెప్పారు. తెలంగాణను ఆంధ్రలో కలిపే కుట్ర జరుగుతోందని.. దాన్ని సహించే ప్రసక్తేలదేని తేల్చి చెప్పారు. బండి సంజయ్, షర్మిల కుట్రపూరితంగా పాదయాత్రలు చేస్తున్నారని రవీందర్ సింగ్ విమర్శించారు.