రాహుల్ గాంధీని ట్యూబ్‌లైట్ అన్న ప్రధాని మోడీ

రాహుల్ గాంధీని ట్యూబ్‌లైట్ అన్న ప్రధాని మోడీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ ‘ట్యూబ్‌లైట్’ అని కామెంట్ చేశారు. ట్యూబ్‌లైట్లు వెలగడానికి బాగా టైమ్ పడుతుందంటూ సెటైర్ వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడుతుండగా రాహుల్ అడ్డుతగలడంతో ఆయన ఈ మాట అన్నారు.

మరో ఆరు నెలల్లో యువత మోడీని కర్రలతో బాదేసే రోజు రాబోతోందని నిన్న ఓ కాంగ్రెస్ నేత అన్నారని, దానికి తాను రెడీ అవుతున్నానని  వ్యంగ్యంగా అన్నారు మోడీ. ఆ దెబ్బలు తట్టుకునే శక్తి కోసం సూర్య నమస్కరాలు మరింత ఎక్కువగా చేస్తానని అన్నారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ.. ప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. దీంతో మోడీ తాను దాదాపు 40 నిమిషాల నుంచి మాట్లాడుతుంటే అటువైపు కరెంట్ పాస్ అవ్వడానికి ఇంత సమయం పట్టిందన్నారు. ‘ట్యూబ్‌లైట్లు’ ఇలానే ఉంటాయని ఆయన అనడంతో సభలో అంతా నవ్వు ఆపుకోలేకపోయారు.

అంతకుముందు మోడీ తన ప్రసంగంలో కాంగ్రెస్‌ను తూర్పారబట్టారు. ఆ పార్టీలాగే పాలించి ఉంటే ఆర్టికల్ 370 రద్దు, రామ జన్మభూమి సమస్య లాంటివి ఎప్పటికీ పరిష్కారం అయ్యేవి కాదన్నారు. అలాగే ఎమర్జెన్సీ, సీఏఏ సహా అనే విషయాలపై కాంగ్రెస్ తీరును ఆయన తప్పుబట్టారు.

More News:

ఓ వ్యక్తికి ప్రధాని పదవి కోసం దేశాన్ని విభజించారు

కాంగ్రెస్‌లా పరిపాలిస్తే ఎప్పటికీ సమస్యల భారతమే

మహాత్మాగాంధీ మీకు ట్రైలర్ కావచ్చు.. మాకు జీవితం