ఐబొమ్మ పేరుతో పైరసీ భూతానికి తెరలేపి టాలీవుడ్ ఇండస్ట్రీకి సవాల్ గా నిలిచిన ఇమ్మడి రవిని అరెస్టు చేసిన పోలీసులు.. సినీ ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 2025 నవంబర్ 17న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీపీ సజ్జనార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా నటుడు అక్కినేని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ ద్వారా ఉచితంగా సినిమా చూస్తున్నామని ప్రేక్షకులు అనుకోవద్దని అన్నారు. మీ డేటా చోరీ అవుతుందనేది గుర్తుంచుకోండి.. దీని వలన మీరు రిస్క్ లో పడతారనే నిజాన్ని గ్రహించాలని సూచించారు.
తమ కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్టుకు గురయ్యారని చెప్పిన నాగ్.. పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. పైరసీ విషయంలో తాము చేయలేని పని.. తెలంగాణ పోలీసులు చేశారని నాగార్జున కొనియాడారు.
