తల్లి బతికి ఉండగానే పెద్దకర్మ

తల్లి బతికి ఉండగానే పెద్దకర్మ
  • కార్డులు ప్రింట్ చేయించి పంచిన కొడుకు

నకిరేకల్, వెలుగు: తల్లి బతికి ఉండగానే చనిపోయిందంటూ పెద్దకర్మ కార్డులు ప్రింట్​చేయించి సోషల్​మీడియాలో వైరల్ ​చేశాడో కొడుకు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామంలోని జంగాల కుటుంబానికి చెందిన వారణాసి హన్మంతు, పోషమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు. అందరి పెండ్లిళ్లు అయ్యాయి. 2009లో హన్మంతు మృతిచెందాడు. అప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ పోషమ్మ జీవనం సాగిస్తోంది. కూలి పని చేయగా వచ్చిన డబ్బులు చిన్నకొడుకు మశ్చగిరికే ఇస్తుందని, తన ఇంటికి పదేండ్లుగా రావడం లేదని పెద్దకొడుకు యాదగిరి కక్ష పెంచుకున్నాడు. బతికి ఉన్న తల్లి చనిపోయిందంటూ.. ఈ నెల 28న నకిరేకల్​ మార్కెట్ ​రోడ్డులోని తన ఇంట్లో కార్యక్రమానికి బంధువులంతా హాజరు కావాలని కోరుతూ కార్డు ముద్రించి పంపిణీ చేశాడు. విషయం తెలిసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు యాదగిరికి కౌన్సెలింగ్​ ఇచ్చి పంపించారు.