పాయల్ రాజ్​పుత్​ మూవీ నుంచి పవర్​ఫుల్ సాంగ్

పాయల్ రాజ్​పుత్​  మూవీ  నుంచి  పవర్​ఫుల్ సాంగ్

పాయల్ రాజ్‌‌పుత్‌‌ లీడ్‌‌ రోల్‌‌లో అజయ్‌‌ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మంగళవారం’. స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ  నిర్మిస్తున్నారు. బుధవారం ‘గణగణ మోగాలిరా’ అనే పాటను విడుదల చేశారు. జాతర నేపథ్యంలో సాగే ఈ పాటను ‘కాంతారా’ ఫేమ్ అజనీష్ లోక్‌‌నాథ్ కంపోజ్ చేయగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు. వి.ఎం.మహాలింగం పాడారు. ‘మరణం తప్పదిక ప్రతి మంగళారం.. చెమటలు పట్టిస్తది ఒక్కో చావు మేళం..’ అంటూ కథ గురించి పాటలో కొన్ని హింట్స్ ఇచ్చారు.  ‘గ్రామీణ నేపథ్యంలో మన తెలుగు నేటివిటీతో తీస్తున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్’ అని దర్శకుడు అజయ్ భూపతి చెప్పారు. ‘కంటెంట్‌‌తో కూడిన కమర్షియల్ సినిమా ఇదని, త్వరలోనే ట్రైలర్, సినిమా విడుదల తేదీలను వెల్లడిస్తాం’ అని నిర్మాతలు చెప్పారు.