న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోలుకున్నారు. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంటి వద్దే చికిత్స కొనసాగుతుందని డాక్టర్లు చెప్పారు. మార్చి 24న అర్ధరాత్రి జ్వరంతో సోనియా దవాఖానలో చేరారు.
ఆమె శరీరంలో ‘సిస్టమిక్ ఇన్ఫెక్షన్’ ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందించారు. ‘‘సోనియా గాంధీ చికిత్సకు సానుకూలంగా స్పందించారు. ఆమె కోలుకోవ డంతో మంగళవారం ఉదయం డిశ్చార్జ్ చేశాం’’ అని తెలిపారు.
