నామినేషన్ వేసిన యూపీఏ చైర్ పర్సన్

నామినేషన్ వేసిన యూపీఏ చైర్ పర్సన్

యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నేడు ఉత్తరప్రదేశ్‌ లోని రాయ్ బరేలీలో నామినేషన్ వేశారు. నామినేషన్ కు ముందు ఆమె మొదట తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

వరుసగా ఐదు సార్లు రాయబరేలీ నుంచి పోటీ చేసి గెలిచిన సోనియా.. ఆరో సారి కూడా గెలుపుపై కన్నేశారు. ఆమెకు ప్రత్యర్థిగా  బీజేపీ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేయనున్నారు. కాగా దినేష్ ఇటీవలే కాంగ్రెస్ నుంచి వీడారు.

నామినేషన్ వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని.. ఆయనకు ప్రజలు బుద్ధి చెప్తారని  అన్నారు. 2004లో వాజపేయికి ఎదురైన పరాభవమే మోడీకి తప్పదని సోనియా గాంధీ అన్నారు.