కరోనా టైమ్‎లో ఉపాధి హామీ పథకమే ఆదుకుంది.. సోనియా

కరోనా టైమ్‎లో ఉపాధి హామీ పథకమే ఆదుకుంది.. సోనియా

కరోనా టైమ్ లో కోట్ల మంది పేదలను ఉపాధి హామీ పథకం ఆదుకుందన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. కొన్నేళ్లక్రితం ఉపాధి హామీ గురించి అందరూ హేళన చేశారన్నారు సోనియా గాంధీ. కేంద్ర ప్రభుత్వాన్ని రక్షించడంతో.. ఉపాధి హామీ పథకం పాజిటివ్ రోల్ ప్లే చేసిందన్నారు. కానీ.. ఉపాధి హామీ పథకం కోసం బడ్జెట్ కేటాయింపుల్లో నిరంతరం కోతలు జరుగుతున్నాయన్నారు సోనియా గాంధీ. సకాలంలో చెల్లింపులు, ఉద్యోగ రక్షణకు సంబంధించిన చట్టపరమైన హామీని బలహీన పరుస్తోందన్నారు. ఉపాధిహామీ పథకం కోసం బడ్జెట్ లో గతేడాది కంటే 35 శాతం కోత విధించారన్నారు.ఉపాధి హామీ కోసం బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలన్నారు. పనిచేసిన 15 రోజుల్లోపు కార్మికులకు వేతనాలు చెల్లించేలా హామీ ఇవ్వాలన్నారు. చెల్లింపులో జాప్యం జరిగితే చట్టబద్ధంగా హామీ ఇవ్వాలన్నారు. రాష్ట్రాల వార్షిక కార్యాచరణ ప్రణాళికలో ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణయించాలని కేంద్రాన్ని కోరారు సోనియాగాంధీ.

మరిన్నివార్తల కోసం