ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికలివి : సోనియా గాంధీ

ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికలివి : సోనియా గాంధీ
  • ఈ పోరాటంలో ప్రజలందరూ ముందుకురావాలి: సోనియా గాంధీ

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోనియా గాంధీ అన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమ స్యలతో పాటు రాజ్యాంగ సంస్థలను కాపాడు కునేందుకు ఈ ఎన్నికల్లో యుద్ధం చేస్తున్నా మని చెప్పారు. ఈ పోరాటంలో ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. ఢిల్లీలో ఉన్న 7 ఎంపీ సీట్లలో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని గురువారం ఓ వీడి యో ప్రకటనలో ఆమె విజ్ఞప్తి చేశారు.

‘‘మీరు వేసే ప్రతి ఓటు ఉద్యోగాలను క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది. మహిళా సాధికా రతను పెంచుతుంది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న దేశంగా భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సృష్టిస్తుంది. ఇందుకోసం ఢిల్లీలోని 7 లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇండియా కూటమి అభ్యర్థులను  గెలిపించండి” అని ఆమె కోరారు.