లెఫ్టిస్టులూ ఇంకెంతగా దిగజారుతారు?

లెఫ్టిస్టులూ ఇంకెంతగా దిగజారుతారు?

ముంబై: ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ రీసెంట్‌‌గా బ్లడ్ డొనేట్ చేశాడు. అలాగే ఆక్సిజన్ కాన్‌సంట్రేటర్‌‌లను దానం చేశాడు. దీనికి సంబందించిన ఫొటోలను ఆయన తన ఇన్‌‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. అయితే రక్తదానం చేసే సమయంలో సోనూ మాస్కు వేసుకోవడంపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. మాస్కు కట్టుకోవడం కూడా తెలియదా అంటూ ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై సోనూ స్పందించాడు. బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు మాస్కు వేసుకోరనే విషయం తెలియదా అంటూ తనపై వ్యాఖ్యలు చేస్తున్న వారికి ఘాటుగా బదులిచ్చాడు. తనపై కామెంట్స్ చేస్తున్న ఐన్‌స్టీల్‌‌లకు రక్తదానం చేసేటప్పుడు మాస్కులు వేసుకోవద్దనే విషయం తెలియదని మండిపడ్డాడు. లెఫ్టిస్టులారా ఇంకెంతగా దిగజారుతారని పరుష పదజాలంతో సోనూ ఫైర్ అయ్యాడు.