సోనూ సూద్ పేరిట నకిలీ ఫౌండేషన్..

సోనూ సూద్ పేరిట నకిలీ ఫౌండేషన్..

ముంబై: ప్రముఖ నటుడు సోనూ సూద్ తన నటనతోనేగాక సేవా గుణంతోనూ అందరరి మన్ననలు పొందుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ టైమ్ లో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాడు. ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ, ట్రీట్ మెంట్ విషయంలో ఎందరికో సాయపడుతున్నాడు. ఈ కష్ట కాలంలో మరింత మందికి సాయం చేసేందుకు సూద్ ఫౌండేషన్ ను సోనూ ఏర్పాటు చేశాడు. మామూలు ప్రజలే గాక సారా అలీ ఖాన్ లాంటి స్టార్లు కూడా ఈ ఫౌండేషన్ కు విరాళాలు ఇస్తున్నారు. అయితే సోనూ సూద్ ఫౌండేషన్ పేరిట పలు నకిలీ లింకులు వెబ్ లో చక్కర్లు కొడుతున్నాయి. సోనూ సూద్ ఫౌండేషన్ అంటూ తమ నంబర్లు ఇచ్చి విరాళాలను కొట్టేయాలని కేటుగాళ్లు ప్లాన్ వేశారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న సోనూ.. దీని గురించి ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇలాంటి నకిలీ ట్వీట్లు, వెబ్ లింకులు, ఫోన్ నంబర్లను నమ్మొద్దని.. ఇవి ఫేక్ అని పేర్కొన్నాడు. నకిలీరాయుళ్లను హెచ్చరిస్తూ వార్నింగ్ అనే క్యాప్షన్ ను ట్వీట్ కు జత చేశాడు.