కరోనా ను ఎదుర్కొనేందుకు దేశం ఎప్పుడూ సిద్ధంగా లేదు

కరోనా ను ఎదుర్కొనేందుకు దేశం ఎప్పుడూ సిద్ధంగా లేదు

భారత్ లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుండటంపై ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా రక్కసిని ఎదుర్కోవడంలో దేశం ఏ దశలోనూ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.

దేశ జీడీపీలో ఒకటి రెండు శాతం మాత్రమే ఆరోగ్య వ్యవస్థలపై ఖర్చు చేస్తున్నారని.. ఈ విధమైన చర్యలతో కరోనాను ఎప్పటికీ ఎదుర్కోలేమన్నారు సోనూ సూద్. భారత్ అత్యధిక జనాభా ఉన్న దేశమే అయినా, జనాభా అంశాన్ని అందుకు సాకుగా చూపలేమన్నారు. కరోనా కట్టడిలో మనం పొరబాట్లు చేశామన్న అంశాన్ని అంగీకరించాల్సిందేనని అన్నారు.

మరోవైపు సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కు అత్యధిక డిమాండ్ ఏర్పడటంతో.. భారత్ లో విస్తృత స్థాయిలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు తాను చైనా, ఫ్రాన్స్, తైవాన్ దేశాలతో చర్చిస్తున్నట్టు సోనూ సూద్ తెలిపారు.