సాయం కోసం నిన్న 41,660 రిక్వెస్ట్స్ వచ్చినయ్

సాయం కోసం నిన్న 41,660 రిక్వెస్ట్స్  వచ్చినయ్

కోవిడ్ వేళ ఆపదలో ఉన్న వారికి తోచినంత సాయం చేస్తున్నారు రియల్ హీరో సోనూ సూద్. రోజుకు వేలాది మంది తనను సాయం కోసం ఆశ్రయిస్తున్నారు.  సాయం కోసం నిన్న(శనివారం)ఒక్కరోజే తనకు 41 వేల 660 రిక్వెస్ట్స్ వచ్చాయన్నారు  సోనూ సూద్. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నవారికి ఉదారంగా సాయం చేస్తున్నాడు.  దీంతో వేలాది మంది సాయం కోసం సోనూ సూద్ ను ఆశ్రయిస్తున్నారు. సాయం కోరిన  ప్రతి ఒక్కరినీ రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు సోనూ సూద్ ట్వీట్ చేశారు. అయితే అందరితో మాట్లాడాలంటే కనీసం 14 ఏళ్లు పడుతుందని... 2035 వరకు ఎదురు చూడాల్సి ఉంటుందని ట్వీట్ చేశాడు సోనూ సూద్.