కోహ్లీ-రోహిత్‌‌ కంటే సచిన్‌‌-సౌరవే తోపు : ఇయాన్‌‌ చాపెల్‌‌

కోహ్లీ-రోహిత్‌‌ కంటే సచిన్‌‌-సౌరవే తోపు : ఇయాన్‌‌ చాపెల్‌‌

న్యూఢిల్లీ: కోహ్లీ–రోహిత్‌‌ జోడీతో పోలిస్తే.. సచిన్‌‌–సౌరవ్‌‌.. అత్యుత్తమ నాణ్యమైన పేసర్లను ఎదుర్కొన్నారని ఆస్ట్రేలియా లెజెండ్‌‌ ఇయాన్‌‌ చాపెల్‌‌ అభిప్రాయపడ్డాడు. అందుకే వాళ్ల జాబ్‌‌ చాలా కష్టంతో కూడుకున్నదన్నాడు. ఇండియా బెస్ట్‌‌ వన్డే బ్యాట్స్‌‌మన్‌‌ ఎవరన్న దానిపై చాపెల్‌‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అపోజిషన్‌‌ బలాన్ని చూసి ప్లేయర్‌‌ సత్తాను అంచనా వేయాలన్న పాక్‌‌ గ్రేట్‌‌ ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ మాటలను కోట్‌‌ చేస్తూ మాస్టర్‌‌–దాదా నైపుణ్యాన్ని విశ్లేషించాడు. ఈ ఇద్దరు ఆడే సమయంలో ప్రతి టీమ్‌‌లోనూ ఇద్దరు హైయ్యెస్ట్‌‌ క్వాలిటీ బౌలర్లు ఉన్నారని చెప్పాడు. ‘పాక్‌‌లో అక్రమ్‌‌–వకార్‌‌, విండీస్‌‌లో ఆంబ్రోస్‌‌–వాల్స్‌‌, ఆసీస్‌‌లో మెక్‌‌గ్రాత్‌‌–బ్రెట్‌‌ లీ, సౌతాఫ్రికాలో డొనాల్డ్‌‌–పొలాక్‌‌, శ్రీలంకలో మలింగ–వాస్‌‌ లాంటి వరల్డ్‌‌ క్లాస్‌‌ బౌలర్లు ఉన్నారు. వీళ్లంతా బ్యాట్స్‌‌మెన్‌‌కు పరీక్ష పెట్టేవారే. ఏ ఒక్కరూ తక్కువ కాదు. అలాంటి వీరందర్నీ సచిన్‌‌, గంగూలీ దీటుగా ఎదుర్కొన్నారు. కరెంట్‌‌ స్టాట్స్‌‌ను పరిశీలిస్తే కోహ్లీ, రోహిత్ ద్వయం బాగా ఆడి ఉండొచ్చు. కానీ వైట్‌‌బాల్‌‌ ఫార్మాట్‌‌లో ఈ ఇద్దరే గొప్ప అనడం మాత్రం కరెక్ట్‌‌ కాదు. టీ20ల్లో ఈ ఇద్దరి రికార్డులు బాగుండొచ్చు. రెండు ఫార్మాట్లలో కోహ్లీ యావరేజ్‌‌ 50కి పైగా ఉండొచ్చు. కానీ టీ20లో సచిన్‌‌ ఆడింది చాలా తక్కువ. గంగూలీ ఆడనేలేదు. కాబట్టి అసలు పోలికే అవసరం లేదు. లిమిటెడ్‌‌ ఫార్మాట్‌‌లో  ఆల్‌‌టైమ్‌‌ బెస్ట్‌‌బ్యాట్స్‌‌మెన్ అయిన ఈ నలుగురు ప్లేయర్లు ఉన్న ఇండియా అభిమానులు అదృష్టవంతులు.  టెండూల్కర్ బ్యాటింగ్ కళాత్మకమైనది. బౌన్సీ పిచ్‌‌లపై బ్యాక్ ఫుట్‌‌ ఫోర్సింగ్ షాట్స్‌‌లతో అలరించడం అతనికే సాటి. గంగూలీ అంత గొప్పగా ఆఫ్‌‌సైడ్ ఆడకున్నా.. అతను ఆడే డ్రైవ్స్ ఆకట్టుకునేవి. ఇక  కోహ్లీ స్థిరంగా రాణిస్తూ సక్సెస్‌‌ అవుతున్నాడు. రోహిత్‌‌ ప్రారంభంలో రిస్క్‌‌ తీసుకోకపోయినా.. కుదురుకున్న తర్వాత చెలరేగుతాడు. క్రిస్‌‌ గేల్‌‌లా మజిల్‌‌ పవర్‌‌‌‌ చూపించకపోయినా ఇన్నింగ్స్‌‌లో ఎక్కువ సిక్సర్లు బాది స్ట్రైక్ రేట్ మెరుగుపరుచుకుంటాడు’అని చాపెల్‌‌ వివరించాడు.