మళ్లీ బ్యాట్ పట్టనున్న గంగూలీ.. ఎప్పుడంటే.. ​

మళ్లీ బ్యాట్ పట్టనున్న గంగూలీ.. ఎప్పుడంటే.. ​
  • వచ్చే నెల 16న కోల్​కతాలో లెజెండ్స్‌‌ లీగ్ స్పెషల్‌‌ మ్యాచ్‌‌
  • ఇండియా టీమ్‌‌కు కెప్టెన్‌‌గా దాదా

న్యూఢిల్లీ: ఇండియా మాజీ కెప్టెన్‌‌, బీసీసీఐ బాస్‌‌ సౌరవ్‌‌ గంగూలీ మళ్లీ బ్యాట్​ పట్టనున్నాడు. తన హోమ్‌‌గ్రౌండ్‌‌ కోల్‌‌కతా ఈడెన్‌‌ గార్డెన్స్‌‌లో బరిలోకి దిగబోతున్నాడు. 75వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా లెజెండ్స్‌‌ క్రికెట్‌‌ లీగ్‌‌ (ఎల్‌‌ఎల్‌‌సీ) రెండో సీజన్‌‌లో ఇండియా మహారాజాస్‌‌– వరల్డ్‌‌ లెజెండ్స్‌‌ జట్ల మధ్య ఓ ప్రత్యేక మ్యాచ్‌‌ను ఏర్పాటు చేశారు. 
వచ్చే నెల16న  ఈడెన్‌‌ గార్డెన్స్‌‌లో జరిగే ఈ పోరులో ఇండియాకు గంగూలీ, వరల్డ్ లెజెండ్స్‌‌కు ఇయాన్‌‌ మోర్గాన్‌‌ సారథ్యం వహిస్తారు. కాగా, ఎల్‌‌ఎల్‌‌సీ రెండో  సీజన్‌‌ను 75వ స్వాతంత్య్ర వేడుకలకు అంకితం  చేస్తున్నట్టు లీగ్‌‌ కమిషనర్‌‌ రవిశాస్త్రి  ప్రకటించాడు. నాలుగు జట్లతో కూడిన ఈ లీగ్ రెండో సీజన్‌‌ సెప్టెంబర్‌‌ 17న మొదలవుతుందని చెప్పాడు.  అక్టోబర్‌‌ 8 వరకు టోర్నీ జరుగుతుందన్నాడు.