క్రికెట్ ఆడనున్న సౌరవ్ గంగూలీ

క్రికెట్ ఆడనున్న సౌరవ్ గంగూలీ

బెంగాల్ టైగర్.. క్రికెట్ దాదా.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. అదేంటి గంగూలీ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు..మళ్లీ ఇప్పుడు క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అని అనుకుంటున్నారా..అదేం లేదు. గంగూలీ క్రికెట్ ఆడటం నిజమే కానీ..దేశం తరపున మాత్రం కాదు. అతను లెజెండ్స్ లీగ్ క్రికెట్లో పాల్గొనబోతున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్ -2లో ఒక మ్యాచ్ ఆడతానని గంగూలీ ప్రకటించాడు. ఓ సోషల్ కాస్ కోసం గంగూలీ ఈ మ్యాచ్లో ఆడతానని ప్రకటించాడు. 

ఫిట్నెస్ కోసం చెమటోడుస్తున్న గంగూలీ..

లెజెండ్స్ లీగ్ కోసం గంగూలీ ఇప్పటి నుంచే ఫిట్నెస్ సాధించడం మొదలు పెట్టాడు. ఈ మేరకు జిమ్లో చెమటోడుస్తున్న ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ‘‘ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కోసం లెజెండ్స్ లీగ్‌లో భాగంగా ఒక ఛారిటీ ఫండ్ రైజింగ్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అందుకోసం సిద్ధం అవుతున్నాను. ఈ మ్యాచ్‌లో టాప్ లెజెండరీ క్రికెటర్లతో తలపడాలి. ఎలాగైన మంచి క్రికెటింగ్ షాట్లు ఆడాలి’’ అంటూ గంగూలీ పోస్ట్ పెట్టాడు. 

దాదా ఎన్ని పరుగులు చేశాడు..
సౌరవ్ గంగూలీ తన కెరియర్ లో 113టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 18,575 పరుగులు చేశాడు.  మొత్తం అన్ని ఫార్మాట్లలో కలిపి 195 మ్యాచుల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు. గంగూలీ సారథ్యంలో భారత జట్టు 97 మ్యాచుల్లో గెలిచింది. 1996లో ఇంగ్లాండ్‌పై లార్డ్స్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన దాదా..ఫస్ట్ టెస్టులోనే సెంచరీ సాధించాడు.