V6 News

నిలకడగా సౌరవ్ గుంగూలీ ఆరోగ్యం

నిలకడగా సౌరవ్ గుంగూలీ ఆరోగ్యం
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. గుండెపోటుకు గురైన గంగూలీ.. కోల్ కతా లోని ఉడ్ ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. బుధవారం ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. కోల్ కతా లోని ఉడ్ ల్యాండ్ ఆసుపత్రిలో గంగూలీ చికిత్స పొందుతున్నారు. తొమ్మిది మంది డాక్టర్లతో కూడిన టీం ఇవాళ(సోమవారం) గంగూలీ ఆరోగ్యంపై సమీక్ష నిర్వహించారు.  ఆ తర్వాత ప్రస్తుతం గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు డాక్టర్లు. ఇప్పటికప్పుడు మరో యాంజియోప్లాస్టీ అవసరం లేదని… రెండు వారాల్లో యాంజియోప్లాస్టీని నిర్వహిస్తామని చెప్పారు. వైద్య బృందం సమీక్ష నిర్వహించిన సమయంలో వారితో పాటు గంగూలీ భార్య డోనా, సోదరుడు స్నేహాసిస్ గంగూలీ ఉన్నారు. ప్రస్తుతం గంగూలీ ఐసీయూలోనే ఉన్నారు.