World Cup 2023: వరల్డ్ కప్‌లో తలపడే దక్షిణాఫ్రికా జట్టు ఇదే.. ఐపీఎల్ హీరోలకు నో ఛాన్స్

 World Cup 2023: వరల్డ్ కప్‌లో తలపడే దక్షిణాఫ్రికా జట్టు ఇదే.. ఐపీఎల్ హీరోలకు నో ఛాన్స్

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్ కప్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్(సీఎస్‌ఏ) జట్టును ప్రకటించింది.  మొత్తం 15 మంది సభ్యులతో గల టీమ్ ను మంగళవారం వెల్లడించింది. ఈ జట్టుకు టెంబా బవుమా నాయకత్వం వహించనున్నాడు. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో కూడిన ప్రొటీస్ జట్టు బలంగానే కనిపిస్తోంది.

ఐపీఎల్ హీరోలకు నో ఛాన్స్

ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్‌కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో  వీరిద్దరూ విఫలమవడమే అందుకు కారణం. ఇక ఈ ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు సీనియర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ప్రకటించాడు.

దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, వాండర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, సిసంద మగాలా, కేశవ్ మహరాజ్, లుంగీ ఎంగిడి, మార్కో జెన్ సెన్, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబాడా, తబ్రాయాజ్ షంషీ, కగిసో రబడా, గెరాల్డ్ కోయెట్జీ.