సౌతాఫ్రికా 4/4.. ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ లో యూఏఈపై గెలుపు

సౌతాఫ్రికా 4/4.. ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ లో యూఏఈపై గెలుపు

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో సౌతాఫ్రికా లీగ్‌‌‌‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లోనూ విజయం సాధించింది. బుధవారం జరిగిన గ్రూప్‌‌‌‌–డి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 6 వికెట్ల తేడాతో యూఏఈపై నెగ్గింది. టాస్‌‌‌‌ ఓడిన యూఏఈ 20 ఓవర్లలో 122/6 స్కోరు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో అలిషాన్‌‌‌‌ షెరాఫే (45) టాప్ స్కోరర్‌‌గా నిలవగా..   మహ్మద్‌‌‌‌ వసీమ్‌‌‌‌ (22) కూడా రాణించాడు.

 కార్బిన్‌‌‌‌ బాష్‌‌‌‌ 3, అన్రిచ్‌‌‌‌ నోర్జ్‌‌‌‌ 2 వికెట్లు పడగొట్టారు.  అనంతరం  సౌతాఫ్రికా 13.2 ఓవర్లలో 123/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. కెప్టెన్‌‌‌‌ మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (28), డికాక్‌‌‌‌ (14).. 56 రన్స్‌‌‌‌ జోడించి వెనుదిరిగారు. తర్వాత ర్యాన్‌‌‌‌ రికెల్టన్‌‌‌‌ (30), డెవాల్డ్‌‌‌‌ బ్రెవిస్‌‌‌‌ (36) ధనాధన్‌‌‌‌ షాట్లతో రెచ్చిపోయారు. కార్బిన్‌‌‌‌ బాష్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.