పేస్​ దెబ్బకు బ్యాటర్లు బోల్తా .. తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో టీమిండియా ఓటమి

పేస్​ దెబ్బకు బ్యాటర్లు బోల్తా .. తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో టీమిండియా ఓటమి
  • ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ 32 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో సౌతాఫ్రికా గ్రాండ్​ విక్టరీ
  • రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 131 రన్స్​కే కుప్పకూలిన ఇండియా 
  • సౌతాఫ్రికా 408 ఆలౌట్

సెంచూరియన్‌‌‌‌‌‌‌‌: సౌతాఫ్రికాలో టీమిండియాకు మరోసారి పరాభవం ఎదురైంది. ఇంతవరకు సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ గెలవని ఇండియా ఈసారి కూడా అవకాశాన్ని చేజార్చుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌సేన ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ 32 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ప్రొటీస్‌‌‌‌‌‌‌‌ చేతిలో చిత్తయ్యింది. దీంతో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో హోమ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ 1–0 లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. 256/5 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో గురువారం మూడో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 108.4 ఓవర్లలో 408 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. డీన్‌‌‌‌‌‌‌‌ ఎల్గర్‌‌‌‌‌‌‌‌ (287 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 28 ఫోర్లతో 185), మార్కో జెన్సెన్‌‌‌‌‌‌‌‌ (84 నాటౌట్‌‌‌‌‌‌‌‌) దంచికొట్టారు. బుమ్రా 4, సిరాజ్‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు తీశారు. 

తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 34.1 ఓవర్లలో131 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (76) మినహా మిగతా అందరూ ఫెయిలయ్యారు. ఎల్గర్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి కేప్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది.  

కీలక భాగస్వామ్యం..

11 రన్స్‌‌‌‌‌‌‌‌ స్వల్ప తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంతో మూడో రోజు ఆట మొదలుపెట్టిన ఎల్గర్‌‌‌‌‌‌‌‌, జెన్సెన్‌‌‌‌‌‌‌‌ భారీ భాగస్వామ్యంతో సౌతాఫ్రికాను మెరుగైన స్థితిలో నిలిపారు. ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా పేస్‌‌‌‌‌‌‌‌ను రాబట్టడంలో శార్దూల్‌‌‌‌‌‌‌‌ (1/101), ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ (1/93) ఫెయిలయ్యారు. లో లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌ను ఈ జోడీ ఎక్కువగా స్వింగ్‌‌‌‌‌‌‌‌ చేయలేకపోయింది. దీంతో ఎల్గర్‌‌‌‌‌‌‌‌, జెన్సెన్‌‌‌‌‌‌‌‌ పుల్‌‌‌‌‌‌‌‌, కట్‌‌‌‌‌‌‌‌ షాట్స్‌‌‌‌‌‌‌‌తో చెలరేగారు. మధ్యలో షార్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ టెక్నిక్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించినా జెన్సెన్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ హుక్‌‌‌‌‌‌‌‌ షాట్స్‌‌‌‌‌‌‌‌ ముందు ఈ స్ట్రాటజీ తేలిపోయింది. 

228 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 150 మార్క్‌‌‌‌‌‌‌‌ చేరుకున్న ఎల్గర్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ సెంచరీ దిశగా ముందుకెళ్లడంతో ఇండియా ప్లేయర్లు ఢీలా పడ్డారు. అయితే ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ 95వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో శార్దూల్‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌ వేసిన బౌన్సర్‌‌‌‌‌‌‌‌ను పుల్‌‌‌‌‌‌‌‌ చేయబోయిన ఎల్గర్‌‌‌‌‌‌‌‌... కీపర్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఫలితంగా ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌కు 111 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. మరో ఐదు ఓవర్ల తర్వాత అశ్విన్‌‌‌‌‌‌‌‌ (1/41) టర్నర్‌‌‌‌‌‌‌‌కు గెరాల్డ్‌‌‌‌‌‌‌‌ కోయెట్జీ (19) వెనుదిరిగాడు. దీంతో లంచ్‌‌‌‌‌‌‌‌ వరకు ప్రొటీస్‌‌‌‌‌‌‌‌ 392/7 స్కోరు చేసింది. రెండో సెషన్‌‌‌‌‌‌‌‌లో జెన్సెన్‌‌‌‌‌‌‌‌ భారీ షాట్లకు తెరలేపినా.. ఆరంభంలోనే బుమ్రా ఝలక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 9వ ఓవర్ల వ్యవధిలో కగిసో రబాడ (1), నాండ్రీ బర్గర్‌‌‌‌‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ బవూమ అబ్సెంట్‌‌‌‌‌‌‌‌ కావడంతో సఫారీలు 163 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ముగించారు. 

కోహ్లీ మినహా.. 

163 రన్స్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ లోటుతో  రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన ఇండియాను సఫారీ పేసర్లు నాండ్రీ బర్గర్‌‌‌‌‌‌‌‌ (4/33), మార్కో జెన్సెన్‌‌‌‌‌‌‌‌ (3/36), రబాడ (2/32) దెబ్బకొట్టారు. తొలి ఆరు ఓవర్లలోనే ఓపెనర్లు రోహిత్‌‌‌‌‌‌‌‌ (0), యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ (5)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపారు. 13/2 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన కోహ్లీ, శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (26) ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను కాపాడే ప్రయత్నం చేశారు. విరాట్‌‌‌‌‌‌‌‌ మంచి కవర్‌‌‌‌‌‌‌‌డ్రైవ్స్‌‌‌‌‌‌‌‌తో బౌలర్లపై ఆధిపత్యం చూపెట్టినా గిల్‌‌‌‌‌‌‌‌ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 

14వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో జెన్సెన్‌‌‌‌‌‌‌‌ యార్కర్‌‌‌‌‌‌‌‌కు క్లీన్‌‌‌‌‌‌‌‌బౌల్డ్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 39 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. ఇక్కడి నుంచి టీమిండియా స్టార్లు పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు క్యూ కట్టారు. ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో విరాట్‌‌‌‌‌‌‌‌ కుదురుగా ఆడినా.. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (6), కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (4), అశ్విన్‌‌‌‌‌‌‌‌ (0), శార్దూల్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ (2), బుమ్రా (0), సిరాజ్‌‌‌‌‌‌‌‌ (4) సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. చివర్లో ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ (0 నాటౌట్‌‌‌‌‌‌‌‌)కు తక్కువగా స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన విరాట్‌‌‌‌‌‌‌‌ హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేసి ఆఖరి వికెట్‌‌‌‌‌‌‌‌గా వెనుదిరిగాడు.