విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్లోకి ప్రవేశం.. రేపు ఆసీస్​తో ఢీ

విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్లోకి ప్రవేశం.. రేపు ఆసీస్​తో ఢీ

కేప్‌‌‌‌ టౌన్‌‌: ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టిన సౌతాఫ్రికా.. తొలిసారి విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బౌలింగ్‌‌లో అయబోంగా ఖాక (4/29), షబ్నిమ్‌‌ ఇస్మాయిల్‌‌ (3/27) రాణించడంతో.. శుక్రవారం జరిగిన సెమీస్‌‌లో సఫారీ టీమ్‌‌ 6 రన్స్‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌కు చెక్‌‌ పెట్టింది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 164/4 స్కోరు చేసింది. ఓపెనర్లు లారా వాల్‌‌వర్ట్​ (44 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 53), తజ్మిన్‌‌ బ్రిట్స్‌‌ (55 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) తొలి వికెట్‌‌కు 96 రన్స్‌‌ జోడించారు. చివర్లో మరిజానే కాప్‌‌ (13 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 27 నాటౌట్‌‌) రాణించింది. చోలీ ట్రయాన్‌‌ (3), డిక్లెర్క్‌‌ (0), సున్​ లుస్‌‌ (3 నాటౌట్‌‌) ఫెయిలయ్యారు. ఇంగ్లిష్‌‌ బౌలర్లలో ఎకిల్‌‌స్టోన్‌‌ 3 వికెట్లు తీసింది. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఇంగ్లండ్‌‌ 20 ఓవర్లలో 158/8 స్కోరుకే పరిమితమైంది. నాట్‌‌ సివర్‌‌ బ్రంట్‌‌ (40) టాప్‌‌ స్కోరర్‌‌. డానీ వ్యాట్‌‌ (34), హీథర్‌‌ నైట్‌‌ (31), సోఫియా డంక్లే (28) మినహా మిగతా వారు నిరాశపర్చారు. బ్రిట్స్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో తలపడుతుంది.