టీ20 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్.. సెమీస్ కు సౌతాఫ్రికా

టీ20 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్.. సెమీస్ కు సౌతాఫ్రికా

టీ20 ప్రపంచకప్ 2024  సూపర్8 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో వెస్టిండీస్ ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగింది. 2024, జూన్ 24వ తేదీ సోమవారం జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ పై సౌతాఫ్రికా మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం135 పరుగులు మాత్రమే చేసింది.  విండీస్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ కైల్ మేయర్స్(35), రోస్టన్ చేజ్‌(52)లు మాత్రమే రాణించారు.  మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. సఫారీ బౌలర్ తబ్రైజ్ షమ్సీ మూడు కీలక వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ వెన్ను విరిచాడు.

ఆ తర్వాత వర్షం కారణంగా డీఎల్ఎస్ పద్ధతిలో 17 ఓవర్లలో 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారి జట్టు.. 16.1ఓవర్లలోనే ఛేదించింది. దీంతో 6 పాయింట్లతో సౌతాఫ్రికా సెమీస్‌కు చేరింది. రెండు గ్రూపుల నుంచి రెండేసీ జట్లు సెమీస్ చేరే అవకాశం ఉండటంతో గ్రూప్2 నుంచి నిన్న ఇంగ్లండ్(4 పాయింట్లు) సెమీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికా సెమీస్‌లో బెర్తు ఖరారు చేసుకుంది. దీంతో వెస్టిండీస్(2), యుఎస్ఎ(0) ఇంటిముఖం పట్టాయి.