చీతాలను పంపేందుకు భారత్‌తో దక్షిణాఫ్రికా ఒప్పందం

చీతాలను పంపేందుకు భారత్‌తో దక్షిణాఫ్రికా ఒప్పందం

చీతాలు అంతరించిపోతున్న నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్ 17న ఎనిమిది చీతాలను నమీబియా నుండి దేశానికి తీసుకువచ్చాయి. అయితే ఈ సంఖ్యను మరింత పెంచడంపై  కేంద్రం దృష్టి సారించింది. అందులో భాగంగా వందకుపైగా చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను వేగవంతం చేసింది. వచ్చే పదేళ్లలో విడతల వారిగా చీతాలను పంపించేందుకు  దక్షిణాఫ్రికా, భారత్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ చీతాలను ఏడాదికి 12  చొప్పున రానున్న 8 నుంచి 10 ఏళ్లలో పంపిస్తామని దక్షిణాఫ్రికా పర్యావరణ శాఖ తెలిపింది. మొదటి విడుతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 చీతాలను భారతకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేసింది. గతేడాది నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కులో వదిలిపెట్టారు. అదే తరహాలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన చీతాలను కూడా అదే పార్కులో విడిచిపెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే దక్షిణాఫ్రికాలో 50కిపైగా కనిపించే నేషనల్ పార్కుల్లో మొత్తంగా 500 చీతాలు ఉన్నట్టు సమాచారం.