
సెకండ్ టీ-20లో సౌతాఫ్రికాకు భారత్ స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే పరుగు చేసి ఔటవ్వగా..ఇషాన్ కిషన్ 34 రన్స్ సాధించాడు. శ్రేయస్ అయ్యర్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్ విఫలమయ్యారు. చివర్లలో దినేష్ కార్తీక్ బ్యాట్ ఝుళిపించడంతో..భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో నోర్జ్టే 2 వికెట్లు దక్కించుకోగా....రబాడా, ప్రిటోరియస్, షామ్షీ, కేశవ్ మహరాజ్, పార్నెల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.