పార్ల్ (సౌతాఫ్రికా): కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ ( 47 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. మంగళవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ తొలుత 20 ఓవర్లలో 173/7 స్కోరు చేసింది. షిమ్రన్ హెట్‌మయర్ (48) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఆతిథ్య బౌలర్లలో జార్జ్ లిండే 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం కెప్టెన్ మార్‌క్రమ్ ముందుండి నడిపించడంతో ప్రోటీస్ టీమ్17.5 ఓవర్లలోనే 176/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. లువాన్ ప్రిటోరియస్ (44), ర్యాన్ రికెల్టన్ (40) కూడా రాణించారు. లిండేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండో టీ20 మ్యాచ్ గురువారం జరగనుంది.
