మహిళల వరల్డ్ కప్ లో ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ఆదివారం (నవంబర్ 2) ఫైనల్ ప్రారంభమైంది. ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా, సౌతాఫ్రికా ఎలాంటి మార్పులు చేయలేదు. సెమీస్ లో ఆడిన ప్లేయింగ్ 11 తో ఇరు జట్లు ఫైనల్ ఆడబోతున్నాయి. వర్షం కారణంగా 2:30 నిమిషాలకు పడాల్సిన టాస్ 4:30కు వేశారు. మ్యాచ్ సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. ఓవర్లను కుదించలేదు. 50 ఓవర్ల మ్యాచ్ జరగనుంది.
దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని గెలిచేందుకు.. తమ కలను సాకారం చేసుకునేందుకు ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ సిద్ధమైంది. 2005, 2017, 2020 (టీ20 కప్)లో ఫైనల్ గడపదాకా వచ్చి.. చివరి మెట్టుపై బోల్తా పడ్డారు. ప్రతిసారీ అభిమానుల గుండె నిరాశతో మూగబోయింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ ఇప్పుడు ఒక్క అడుగు దూరంలో ఉంది. అత్యంత బలమైన ఆస్ట్రేలియాను సెమీఫైనల్లోనే రఫ్పాడించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సైన్యం.. క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న మెగా ఫైనల్‌కు సిద్ధమైంది.
భారత మహిళలు (ప్లేయింగ్ XI):
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్
దక్షిణాఫ్రికా మహిళలు (ప్లేయింగ్ XI):
లారా వోల్వార్డ్ట్(కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), అన్నరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, నాన్‌కులులేకో మ్లాబా
►ALSO READ | IND vs AUS 3rd T20I: డేవిడ్, స్టోయినిస్ ఊచకోత.. టీమిండియా ముందు బిగ్ టార్గెట్!
