జడేజా లేకపోవడంతో ఇండియా ఓడిపోయింది
V6 Velugu Posted on Jan 26, 2022
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఈ సిరీస్ ను సౌతాఫ్రికా 3-0 తేడాతో గెలుచుకుంది. భారత ఘోర పరాజయంపై దక్షిణాఫ్రికా క్రికెటర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా లేకపోవడం కారణంగానే టీమిండియా ఓడిపోయిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
జడేజా అద్భుతమైన ఆటగాడని స్టెయిన్ తెలిపాడు. తన స్పిన్ మాయాజాలంతో ఆటను మలుపు తిప్పగల సమర్థుడని, బ్యాట్ తో కూడా రాణించి జట్టుకు విజయం అందించగల ఆటగాడని అన్నాడు. భారత్ కు బౌలింగ్ విభాగంలో కొంత సమస్య ఉందని చెప్పాడు. బుమ్రాకు అండగా ఒక మంచి బౌలర్ అవసరమని తెలిపాడు. టెస్ట్ సిరీస్ లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని అని అన్నాడు.
మరిన్ని వార్తల కోసం..
ఐసీసీ ర్యాంకింగ్స్: తిరిగి రెండో ప్లేస్లో కోహ్లీ
Tagged Ravindra Jadeja, absence, Dale Steyn, India lost, South African cricketer