ఐసీసీ ర్యాంకింగ్స్: తిరిగి రెండో ప్లేస్లో కోహ్లీ

V6 Velugu Posted on Jan 26, 2022

దుబాయ్: అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తిరిగి రెండో స్పాట్ ను దక్కించుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాతో భారత్ ఆడిన వన్డే సిరీస్ తర్వాత ఈ ర్యాంకింగ్స్ ను అప్ డేట్ చేశారు. హ్యామ్ స్ట్రింగ్ ఇంజ్యూరీతో ఈ సిరీస్ కు దూరమైన టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. సీనియర్ బ్యాటర్ శిఖర్ ధవన్ 15వ ప్లేస్ లో నిలిచాడు. 

కాగా, టీ20 బౌలర్లు, ఆల్ రౌండర్ల ర్యాంకులనూ ఐసీసీ వెల్లడించింది. టాప్ బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్నర్ వన్నిదు హసరంగ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ల కేటగిరీలో బంగ్లాదేశ్ ప్లేయర్ మొహమ్మద్ నబీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. అయితే ఈ రెండు జాబితాల్లోనూ ఒక్క భారత క్రికెటర్ కూడా లేకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తల కోసం: 

సినీ నటుడు శ్రీకాంత్ కు కరోనా

దేశంలో ఒకే మతం, ఒకే భాష ఉండాల్నా?

చైనా చెరలో బాలుడి అప్పగింతకు ఓకే

Tagged Team india, Virat Kohli, Shikhar Dhawan, Rohit Sharma, ICC Rankings, Babar Azam

Latest Videos

Subscribe Now

More News