Horror Thriller: రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా హారర్ థ్రిల్లర్ ‘హ్రీం’.. షూటింగ్ పూర్తి, హైప్ పెంచిన మేకర్స్

Horror Thriller: రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా హారర్ థ్రిల్లర్ ‘హ్రీం’.. షూటింగ్ పూర్తి, హైప్ పెంచిన మేకర్స్

పవన్‌‌‌‌ తాత, డాక్టర్‌‌‌‌ చమిందా వర్మ జంటగా రాజేష్‌‌‌‌ రావూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘హ్రీం’. . సుజాత మల్లాల సమర్పణలో శివమ్‌‌‌‌ మీడియా బ్యానర్‌‌‌‌‌‌‌‌పై శివ మల్లాల నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ ఎక్కడా చెప్పని ఒక యదార్థ గాధ ఆధారంగా ఈ హారర్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ను తెరకెక్కిస్తున్నాం. 

వరంగల్‌‌‌‌ సమీపంలోని పెద్ద పెండ్యాల గ్రామంలో తొలి షెడ్యూల్, హైదరాబాద్‌‌‌‌ హెచ్‌‌‌‌యంటీ కాలనీలోని ఫారెస్ట్‌‌‌‌ లొకేషన్స్‌‌‌‌లో సెకండ్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ని పూర్తి చేశాం. షూటింగ్‌‌‌‌ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌ వర్క్స్‌‌‌‌ జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌ చేస్తాం’ అని చెప్పారు.

తనికెళ్ల భరణి, రాజీవ్‌‌‌‌ కనకాల కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బెనర్జీ, భద్రం, అనింగి రాజశేఖర్‌‌‌‌, త్రిపురనేని శ్రీవాణి, పూజారెడ్డి, వనితా రెడ్డి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.