సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఉదయ్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ప్రావీణ్య వివరించారు.
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని, రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ పాండు, నోడల్ అధికారులు జానకి రెడ్డి, వెంకటేశ్వర్లు, రామాచారి, అఖిలేశ్రెడ్డి, అరుణ, తులచ్య నాయక్, జగదీశ్, కిరణ్ కుమార్, చలపతిరావు, బాల్ రాజ్, విజయలక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
