ఇరిగేషన్ భూములు ఆక్రమిస్తే చర్యలు : కడెం ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్ కుమార్

ఇరిగేషన్ భూములు ఆక్రమిస్తే చర్యలు :  కడెం ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్ కుమార్

జన్నారం, వెలుగు: ఇరిగేషన్ భూములను ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కడెం ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఇరిగేషన్ డివిజన్ ఆఫీస్​లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

 జన్నారం మండలం కామన్ పెల్లి గ్రామ సమీపంలో కడెం కెనాల్​కు ఆనుకుని ఉన్న ఇరిగేషన్ భూమిలో ఓ వ్యక్తి దర్గాను నిర్మించాడని, మరికొందరు కెనాల్ పొడువునా భూమిని ఆక్రమించుకుని పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. 

ఇప్పటికైనా ఆక్రమించుకున్న ఇరిగేషన్ భూముల నుంచి స్వచ్ఛంద వైదొలగాలని, లేకపోతే వారికి నోటీసులు జారీ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఈ వెంకటేశం, ఏఈ భీష్మ, జేఈ శ్రావణ్, వర్క్ ఇన్​స్పెక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.