ఇసుక అక్రమాలకు తావులేదు : మైనింగ్ ఏడీ జగన్మోహన్ రెడ్డి 

ఇసుక అక్రమాలకు తావులేదు : మైనింగ్ ఏడీ జగన్మోహన్ రెడ్డి 

చెన్నూరు, వెలుగు: ఇసుక అక్రమ రవాణాపై వస్తున్న వదంతులను నమ్మవద్దని జిల్లా మైనింగ్ ఏడీ జగన్మోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన టీఎస్ ఎండీసీ పీవో వెంకటేశ్వర్లుతో  కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. చెన్నూరు మండలంలోని చింతలపల్లి ఇసుక క్వారీలో అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తిగా ఆవాస్తవమని ఖండించారు.

ఇసుక క్వారీలు నిరంతరం నిఘా నీడలో, అధికారుల పర్యవేక్షణలోనడుస్తున్నాయన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారిత వార్తలు రాయొద్దని, ఏదైనా అక్రమ రవాణా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని వెంటనే చర్యలు తీసుకుంటామని సూచించారు.