బషీర్‌బాగ్, వెలుగు: డాక్టర్ అపాయింట్ మెంట్ కోసం కాల్ చేసిన ఓ వ్యక్తి ఫోన్ హ్యాక్ చేసి సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సిటీలోని రియాసత్‌నగర్‌కు చెందిన 57 ఏండ్ల వ్యక్తి ఈనెల 24న డాక్టర్ అపాయింట్ మెంట్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి.. స్కామర్లు అప్లోడ్ చేసిన ఫేక్ లింక్క్లిక్ చేశాడు. దీంతో వాట్సాప్ ద్వారా స్కామర్లు ‘DOCTORS APPOINTMENT.APK‘ ఫైల్ పంపి ఇన్స్టాల్ చేయమని చెప్పారు.
అలానే బాధితుడు చేసి, వివరాలు నమోదు చేశాడు. అనంతరం అపాయింట్ మంట్ కన్ఫర్మేషన్ కు రూ.10 చెల్లించాలని స్కామర్లు చెప్పడంతో అనుమానం వచ్చి ఫైల్ అన్ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కాకపోవడంతో ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. మరుసటి రోజు ఫోన్ ఆన్ చేసి చూడగా తన బ్యాంక్ అకౌంట్ లోని రూ.4,57,829 ట్రాన్స్ ఫర్ అయ్యాయి. దీంతో బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ సెల్ ఏసీపీ శివమారుతి తెలిపారు.
