Hey Bhagavan: కావల్సినంత వినోదంతో హే భగవాన్‌‌‌‌.. ఫుల్లుగా నవ్విస్తానంటున్న సుహాస్

Hey Bhagavan: కావల్సినంత వినోదంతో హే భగవాన్‌‌‌‌.. ఫుల్లుగా నవ్విస్తానంటున్న సుహాస్

సుహాస్‌‌‌‌, శివానీ నాగరం జంటగా వీకే నరేష్‌‌‌‌ కీలకపాత్రలో గోపీ అచ్చర తెరకెక్కిస్తున్న చిత్రం ‘హే భగవాన్’. బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. బన్నీ వాస్‌‌‌‌, వంశీ నందిపాటి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫిబ్రవరి 20న విడుదల కానుంది.  బుధవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. 

హీరో సుహాస్‌‌‌‌ మాట్లాడుతూ ‘నా గత చిత్రాలతో పోలిస్తే డిఫరెంట్‌‌‌‌గా ఉంటుంది. ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌ క్యారెక్టర్ పోషించా. వినోదంతో పాటు కంటెంట్‌‌‌‌కు ప్రాధాన్యత ఉన్న సినిమా. బ్లాక్‌‌‌‌ బస్టర్‌‌‌‌‌‌‌‌ అవుతుందని, నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో బెస్ట్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌గా నిలుస్తుందని నమ్ముతున్నా’ అని అన్నాడు.

ప్రేక్షకులకు కావాల్సినంత వినోదంతో వస్తున్న పవర్‌‌‌‌ ఫ్యాక్డ్‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ ఇదని శివానీ చెప్పింది.  వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘సుహాస్‌‌‌‌ నుంచి ఆడియన్స్‌‌‌‌ ఎటువంటి కంటెంట్‌‌‌‌ కావాలని అనుకుంటున్నారో అలాంటి సినిమా ఇది. హిట్ కొట్టబోతున్నామనే కాన్ఫిడెన్స్‌‌‌‌ ఉంది’ అని చెప్పారు.   

యాంకర్‌‌‌‌గా పేరు తెచ్చుకున్న తనకు ఈ చిత్రంతో నటిగా కూడా గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందని స్రవంతి చొక్కారపు చెప్పింది.  చిత్ర దర్శకనిర్మాతలతో పాటు అఖిల్‌‌‌‌రాజ్‌‌‌‌, తేజస్వీరావు, దర్శకుడు సాయి మార్తాండ్‌‌‌‌, నటుడు సుదర్శన్‌‌‌‌,  నిర్మాత రమణా రెడ్డిలు  పాల్గొన్నారు.