- టికెట్ రానివాళ్లు నిరాశ చెందవద్దు
- జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లిమంచిర్యాల, క్యాతనపల్లిలో
- పోటీ చేసే ఆశావహులు, లీడర్లతో సమావేశాలు
కోల్‌బెల్ట్, వెలుగు: మున్సిపల్‌ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్తుల విజయం పక్కా అని ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాల కార్పొరేషన్ తోపాటు, జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఆయన పర్యటించారు. మున్సిపల్‌ఎన్నికల్లో టికెట్ఆశించే కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో మరో ఐదేండ్లు కూడా అధికారంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్ లో ఆశావహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజల ఆదరణ ఉన్నవారికే అధిష్టానం బీ-ఫాం ఇస్తుందన్నారు. టికెట్దక్కనివారు నిరాశ చెందవద్దని పార్టీ గుర్తించి ఇతర పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్
ఎన్నో ఆశలు, ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టాడని, బీఆర్ఎస్పాలకులు ఆర్థిక విధ్వంసం చేశారని జూపల్లి విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పుతో ప్రతి ఏటా రూ.75 వేల కోట్లు మిత్తీ చెల్లిస్తున్నామన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపడంలేదని, ఇచ్చిన హామీలతో పాటు మరికొన్నింటిని అమలు చేస్తోందని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ఉప ఎన్నికలతోపాటు పంచాయతీ ఎన్నికల్లో గెలిచామని, ప్రజలంతా కాంగ్రెస్‌తోనే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నమని ధీమా వ్యక్తం చేశారు. చెన్నూరు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మార్చేందుకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారని అన్నారు.
మున్సిపల్‌ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతో అభివృద్ధి సాధ్యమన్నారు. ఆయా సమావేశాల్లో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ లీడర్లు పల్లె రాజు, అబ్దుల్అజీజ్, మహంకాళి శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, నీలం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
