క్రేజీ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ను ఇచ్చే గోల్డ్ స్టోరీ

క్రేజీ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ను ఇచ్చే గోల్డ్ స్టోరీ

దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్, మీషా నారంగ్ లీడ్ రోల్స్‌‌‌‌లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కిస్తున్న చిత్రం ‘శబార’. హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మిస్తున్నారు.  ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ పేరుతో ఈ మూవీ టీజర్‌‌‌‌ను విడుదల చేశారు.  బంగారం ఎక్కువగా లభించే ఓ అటవీ ప్రాంతం నేపథ్యంలో జరిగే కథ ఇది. ‘ఓ ప్రపంచమంతా బంగారమే ఉందని తెలిసినప్పుడు.. ఎన్ని యుద్ధాలు జరిగుంటాయి.. ఈ నేల ఎంత రక్తాన్ని చూసి ఉంటుంది’ అంటూ హీరో చెప్పిన డైలాగ్,  టీజర్ విజువల్స్‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 

ఇక టీజర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌లో హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘శబార అంటే అదొక ప్రపంచం.. దర్శకుడు ప్రేమ్ చంద్ సృష్టించిన  ప్రపంచమిది. ఈ కథ మొత్తం అడవిలోనే జరుగుతుంది. ఇప్పటివరకు నేను చేసిన 8 సినిమాలు స్క్రిప్ట్‌‌‌‌ను నమ్మితే..  ఈ సినిమా మాత్రం దర్శకుడిపై పూర్తి నమ్మకంతో చేశా.  కచ్చితంగా ఈ చిత్రానికి సక్సెస్‌‌‌‌మీట్ జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు.  

‘వందేళ్ల క్రితం ఒక చిన్న  పిల్లాడు ఓ పుట్టగొడుగు తింటే అతనికి గతం, వర్తమానం, భవిష్యత్తు కనిపిస్తే ఎలా ఉంటుందనేదే ఈ చిత్ర ప్రధాన కథ. రెండు డిఫరెంట్ టైమ్స్‌‌‌‌లైన్స్‌‌‌‌లో జరిగే ఈ సినిమా క్రేజీ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ను ఇస్తుంది’ అని దర్శకుడు చెప్పాడు.  నటీనటులు క్రితిక సింగ్,  మీషా నారంగ్,  రాజీవ్ పిళ్లై,  భూషణ్ కళ్యాణ్,  మ్యూజిక్ డైరెక్టర్ మిథున్ ముకుందన్,  కాస్ట్యూమ్ డిజైనర్ సుమాయా తదితరులు పాల్గొన్నారు.