గ్రామీణ మహిళల ఆరోగ్య రక్షణే సర్కార్ లక్ష్యం..సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్

గ్రామీణ మహిళల ఆరోగ్య రక్షణే సర్కార్ లక్ష్యం..సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్

సంగారెడ్డి, వెలుగు: గ్రామీణ ప్రాంత మహిళలకు వచ్చే రొమ్ము, సర్వైకల్​క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సెర్ప్​ సీఈవో దివ్య దేవరాజన్​ తెలిపారు.  

రాష్ట్ర ప్రభుత్వం, సొసైటీ ఫర్​ఎలిమినేషన్​ఆఫ్​రూరల్​పావర్టీ గ్రాన్యూల్స్​ ఇండియా లిమిటెడ్​ సంయుక్తాధ్వర్యంలో బుధవారం సంగారెడ్డిలోని ఎస్ఎస్ ​గార్డెన్​లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. 

మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా  గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉచిత స్క్రీనింగ్​పరీక్షలు, వైద్య సలహాలు అందిస్తామని తెలిపారు. క్యాన్సర్​పైన భయాలు, అపోహలు తొలగించి మహిళల్లో ధైర్యం నింపడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టర్​ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా 13 పీహెచ్ సీలను ఆరోగ్య మహిళా పీహెచ్​సీలుగా గుర్తించామ న్నారు. అక్కడ మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.  మొబైల్​మెడికల్​క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు.

 కార్యక్రమంలో గ్రాన్యూల్స్​ఇండియా ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ ఉమా చిగురుపాటి, ఏఐజీ హాస్పిటల్​అంకాలజిస్ట్​, యూసీ బ్రెస్ట్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకురాలు డాక్టర్ ​ప్రజ్ఞ చిగురుపాటి, డీఆర్డీఏ అధికారులు, ఎస్​హెచ్​జీ గ్రూప్​సభ్యులు పాల్గొన్నారు.