హైదరాబాద్, వెలుగు: కెమికల్స్ కంపెనీ బీఏఎస్‌ఎఫ్ ఈ ఏడాది మార్చిలోపు హైదరాబాద్‌లో గ్లోబల్ డిజిటల్ హబ్‌ను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఇది యూరప్‌లోని లుడ్విగ్‌షాఫెన్, మాడ్రిడ్, ఆసియా పసిఫిక్‌లోని కౌలాలంపూర్‌లో ఉన్న తమ డిజిటల్ హబ్‌లను బలోపేతం చేస్తుందని పేర్కొంది.
బీఏఎస్‌ఎఫ్ వ్యాపారాలకు డిజిటల్ సర్వీస్‌లను ఈ సెంటర్ల నుంచి అందిస్తున్నారు. కంపెనీ సీఎఫ్‌ఓ డిర్క్ ఎల్వెర్మాన్ మాట్లాడుతూ, గ్లోబల్ డిజిటల్ హబ్ ఏర్పాటుకు హైదరాబాద్ అనువైన ప్రదేశమని అన్నారు.
