గిత్యాల టౌన్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల కోడ్‌ను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలపై సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్స్, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని సూచించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల, వెలుగు: కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు జీవాకర్ రెడ్డి, శ్రీనివాస్, కమిషనర్లు రవీందర్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.
