డచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్మాయిలకు టీ20 వరల్డ్ కప్ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

డచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్మాయిలకు టీ20 వరల్డ్ కప్ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కీర్తిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): నెదర్లాండ్స్ విమెన్స్ క్రికెట్ టీమ్ తొలిసారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించింది. ఆ జట్టుతోపాటు బంగ్లాదేశ్ కూడా ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే మెగా టోర్నీకి క్వాలిఫై అయింది.  గ్లోబల్ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా  బుధవారం జరిగిన  సూపర్ సిక్స్ రౌండ్ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెదర్లాండ్స్‌ 21 రన్స్ (డక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతి) తేడాతో  అమెరికాను ఓడించింది. దాంతో విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్తు దక్కించుకొని చరిత్ర సృష్టించింది.

క్వాలిఫయర్స్ టోర్నీ గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన డచ్ జట్టు సూపర్ సిక్స్ దశలోనూ అదే జోరును కొనసాగించింది. మరోవైపు, బంగ్లాదేశ్ 39 రన్స్ తేడాతో థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి బెర్తును ఖాయం చేసుకుంది.  ఇంగ్లండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం 12 ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు గాను 10 స్థానాలు ఖరారయ్యాయి.