WPL: ఫైనల్‌‌‌‌పై ఆర్సీబీ గురి.. యూపీ వారియర్స్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌‌‌‌

WPL: ఫైనల్‌‌‌‌పై ఆర్సీబీ గురి.. యూపీ వారియర్స్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌‌‌‌

వడోదర: వరుసగా ఐదు విజయాలతో టాప్ గేరులో దూసుకొచ్చి గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో డీలా పడ్డ  ఆర్సీబీ డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్‌‌‌‌లో మళ్లీ ఫామ్‌‌‌‌లోకి రావాలని భావిస్తోంది. గురువారం యూపీ వారియర్స్‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌లో గెలిచి  పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకొని నేరుగా ఫైనల్‌‌‌‌కు చేరుకోవాలని చూస్తోంది.

అందరి కంటే ముందుగానే ప్లేఆఫ్స్‌‌‌‌కు అర్హత సాధించిన  స్మృతి మంధాన కెప్టెన్సీలోని ఆర్సీబీ గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో బ్యాటింగ్ వైఫల్యాలను సరిదిద్దుకోవాలని చూస్తోంది. మరోవైపు, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న యూపీ వారియర్స్‌‌‌‌కు ఇది చావో రేవో మ్యాచ్‌‌‌‌. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే యూపీ ఈ మ్యాచ్‌‌‌‌లో భారీ తేడాతో గెలవడమే కాకుండా, ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.