కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో సమ్మక్క- సారలమ్మ జాతర

 కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో  సమ్మక్క- సారలమ్మ జాతర

కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్​ ఇ టెక్నో స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమ్మక్క– సారలమ్మ జాతరను బుధవారం ఘనంగా నిర్వహించారు. చైర్మన్​ నరేందర్​రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద గిరిజన పండుగ అని, కుంభమేళా తలపించేలా ఈ మహోత్సవాన్ని మేడారం, ఇతర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తారన్నారు. మేడారంలో జరిగే జాతరకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. వేడుకల సందర్భంగా ప్రాంగణాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు.