రాజన్నసిరిసిల్ల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపాలిటీ గేటు వేసి, బయటి నుంచే నామినేషన్ పత్రాలు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. మొదటి రోజు మున్సిపల్ నామినేషన్లు పర్వం మొదలైంది.
కాగా ఎక్కడా లేని విధంగా సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్‌లో నామినేషన్ల పత్రాల కోసం అభ్యర్థులు క్యూ లైన్ లో గంటపాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. మీడియా గ్యాలరీ ఏర్పాటు చేయలేదు. దీంతో మీడియాను సైతం కార్యాలయంలోకి అనుమతించలేదు. ఆఫీస్‌లో నామినేషన్ పత్రాలు అందజేయటానికి ఒకే కౌంటర్ ఏర్పాటు చేశారు. లోపల ఓ చిన్న టెంట్ మాత్రమే వేశారు.
