కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొదటి ర్యాండమైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.
అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడేతో సమీక్షించారు. ఎన్నికలు జరిగే పట్టణాల్లో, సిటీలో బ్యాలెట్ బాక్సులు, విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
