ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారు.. ఆ తరువాత వారు ఏం చేశారంటే..!

ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారు.. ఆ తరువాత వారు ఏం చేశారంటే..!
  • ప్రేమ  జంట సూసైడ్.. నాగర్ ​కర్నూల్​ జిల్లా బొమ్మనపల్లిలో ఘటన
  • తమ పెండ్లికి పెద్దలు నిరాకరించారని మైనర్ల అఘాయిత్యం

అచ్చంపేట, వెలుగు:  ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్​కర్నూల్​జిల్లాలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. అచ్చంపేట మండలం బొమ్మనపల్లికి చెందిన దాసరి ప్రశాంత్(16), పదర మండలం చిట్లంగుంటకు చెందిన సువర్ణ(16) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల అమ్మాయి ఇంటికి అబ్బాయి వెళ్లడంతో ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇద్దరూ మనస్తాపానికి గురయ్యారు. రెండు రోజుల కింద  అమ్మాయి బొమ్మనపల్లిలోని అబ్బాయి ఇంటికి వెళ్లింది. అనంతరం మంగళవారం రాత్రి ఇద్దరూ గదిలో ఉరేసుకుని చనిపోయారు. 

సమాచారం అందడంతో అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్, సీఐ నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీలను అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దాపూర్  ఏఎస్ఐ నరసింహారెడ్డి తెలిపారు.